ఫ్యామిలీ మేటర్ బయట పెట్టిన ఫేమస్ అమెరికన్ యాక్ట్రెస్

అమెరికన్ యాక్ట్రెస్ కమ్ డచెస్ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ తన పర్సనల్ మేటర్ ని బయట పెట్టారు అది ఏంటంటే

తల్లి అవ్వటం అనేది ఒక మహిళా సంపూర్ణమైన జీవితం పొందినట్టు. ఒక బిడ్డ ను జన్మ ఇవ్వటం ఎంత ఆనందం ఇస్తుందో, అదే బిడ్డను కడుపులో పోగొట్టుకోవటం అంతే బాధను ఇస్తుంది. ఆ బాధ చూసినవాళ్లు కంటే అనుభవించిన వాల్లకే తెలుస్తుంది, అలాగే ఆ భాధను పంచుకోవడం ఇంకా కష్టం.

వివరాల్లోకి వెళ్తే, వన్ అఫ్ ది పాపులర్ అమెరికన్ యాక్ట్రెస్ కం డచెస్​ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్​ హ్యారీ సతీమణి మేఘన్  మార్కెల్ తన పర్సనల్ మేటర్ ని బయట పెట్టారు అది ఏంటంటే సెకండ్ ప్రెగ్నన్సీ అబార్షన్ అయ్యిందని పేర్కొన్నారు. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ నుండి ఇలాంటి న్యూస్ వినటం … అందులోనూ ఫ్యామిలీ మేటర్ ప్రెస్ తో చెప్పటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. దీనితో ఈ మేటర్ ఒక సెన్సేషన్ న్యూస్ అయ్యింది.

మేఘన్, టైమ్స్ అఫ్ న్యూయార్క్ తో మాట్లాడుతూ తన మిస్ -క్యారేజ్ గురించి చెపుతూ భాధను వ్యక్తం చేసారు. ఫస్ట్ చైల్డ్ చేతిలోకి తీసుకున్నపుడు ఎంత ఆనంద పడిందో, రెండో ప్రెగ్నన్సీ పోవటం కూడా రెట్టింపు బాధను పొందాను అని ఆమె విలేఖరుతో వివరించారు.

బిడ్డను పోగొట్టుకున్న టైం లో నేను బెడ్ మీద ఉన్నాను, నా హస్బెండ్ ప్రిన్స్ హ్యారి కూడా పక్కనే నాతో తోడుగా ఉన్నారు… ఆ చేదు వార్త వినగానే ఇద్దరం కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాము అని చెప్పుకొచ్చింది. ఆ బాధని  ఒంటరిగా భరించాము అని తెలియచేసింది.

బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎప్పుడు బైటికి రావు … అలాంటిది మేఘన్ తన పర్సనల్ విషయం చెప్పటం అనేది వినూత్నమైన వ్యవహారం అనే చెప్పాలి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఇంతవరకు ఎటువంటి మేటర్ అయిన మీడియాకి చెప్పకపోవటం గమనార్హం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు