అబ్దుల్ కలాం వీరాభిమాని.. అచ్చం అలాగే చనిపోయిన నటుడు వివేక్

actor vivek and apj kalam

అబ్దుల్ కలాం.. మాజీ రాష్ట్రపతిగా కంటే.. దేశ భవిష్యత్.. ప్రజల్లో మార్పు కోసం విశేషంగా కృషి చేసిన అద్భుత వ్యక్తి. భారతీయ శాస్త్ర సాంకేతిక రంగం.. అంతరిక్ష పరిశోధనలు, న్యూక్లియర్ పరీక్షల్లో కీలక వ్యక్తి. ఈనాటి ఏ చిన్న పిల్లోడిని అడిగినా.. కలాం స్ఫూర్తి కనిపిస్తోంది. కలాం ఆలోచనలను ముందుకు తీసుకెళ్లటానికి ప్రతి గ్రామంలో ఓ కమిటీ ఉంది అంటే.. అతను వేసిన బీజం మహా వృక్షానికి సంకేతంగా చెప్పొచ్చు.

తమిళనాడు.. తమిళ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా.. అబ్దుల్ కలాం వీరాభిమానిగా.. కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడు నటుడు వివేక్. అతని ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. అబ్దుల్ కలాం స్ఫూర్తితో.. పిల్లలకు, వృద్ధులకు సాయం చేయటంతోపాటు.. కలాం ఆలోచనలను సమాజంలోకి తీసుకెళ్లటంలో కృషి చేశారు నటుడు వివేక్.

అబ్దుల్ కలాం తుది శ్వాస విడిచిన సందర్భాన్ని.. ఇప్పుడు వివేక్ మరణంతో పోల్చుకుంటున్నారు తమిళ జనం.. సినీ అభిమానులు. ఓ సభలో పాఠాలు చెబుతూనే.. ప్రసంగిస్తూనే.. తీవ్ర గుండెపోటుతో చనిపోయారు అబ్దుల్ కలాం. తుది శ్వాస విడిచే సమయంలోనూ అబ్దుల్ కలాం.. తనకు ఇష్టమైన టీచింగ్ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు నటుడు వివేక్ మరణం సైతం.. అచ్చుగుద్దినట్లు అలాగే ఉంది అంటున్నారు అభిమానులు.

ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. రేపటి తరానికి అబ్దుల్ కలాం స్ఫూర్తి.. వారిలో చైతన్యం తీసుకురావాలి అంటూ చర్చించుకుంటూ కుప్పకూలిపోయారంట. మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే కుప్పకూలిపోయారు నటుడు వివేక్. వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అప్పటికే 80 శాతం కష్టం అని చెప్పారు డాక్టర్లు. తీవ్రమైన గుండెపోటు వచ్చిందని.. మా ప్రయత్నం మేం చేస్తామని.. 100 శాతం గ్యారెంటీ ఇవ్వలేమని తేల్చేశారు. అలా చెప్పిన 18 గంటలకే చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు.

అచ్చం అబ్దుల్ కలాం ఎలా అయితే తుది శ్వాస విడిచారో.. అలాగే అతని వీరాభిమాని వివేక్ సైతం చనిపోవటం యాదృచ్ఛికమే అయినా.. అలాగే జరగటం మాత్రం చర్చనీయాంశం అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు