అల్లు అర్జున్ కు కరోనా : యశోధ ఆస్పత్రి డాక్టర్ల ట్రీట్ మెంట్

allu arjune tested corona positive

అల్లు ఫ్యామిలీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నాకు కరోనా పాజిటివ్ అంటూ హీరో అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించారు. ఏప్రిల్ 28వ తేదీ బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అల్లు అర్జున్.

వారం క్రితమే అల్లు అర్జున్ నాన్న.. నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడ్డారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరవింద్ కు పాజిటివ్ రావటం కలకలం రేపింది. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి కుమారుడు అల్లు అర్జున్ కరోనా బారిన పడటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అల్లు ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హోం ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్.. హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి అయిన యశోధ ఆస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో.. వారి సూచనలు, సలహాలతో ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా డాక్టర్లతో మాట్లాడిన మందులు వినియోగం, తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. లక్షణాల్లో మార్పులు వస్తే వెంటనే సంప్రదించిన అందుకు తగ్గట్టు ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నారు.

వారం, 10 రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన అందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అల్లు అర్జున్. ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే కరోనాను జయిస్తానని భరోసా ఇచ్చారు. వీలైతే.. అందుబాటులో ఉండే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని సలహా ఇచ్చారు అల్లు అర్జున్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు