ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ : లవ్ స్టోరీ సినిమా వాయిదా

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన నేపథ్యంలో చిత్రం యూనిట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.

ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఫ్యామీలీ అడియన్స్ ను ఈ సమయంలో థియేటర్ కు రప్పించడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో సినిమాను వాయిదా వేసినట్టు వెల్లడించారు. సరైన సమయం చూసుకోని సినిమా ఎప్పుడు విడుదల చేసేది చెప్తామని దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య వెల్లడించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు