ఏక్ మినీ క‌థ‌ మూవీ రివ్యూ

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..

దర్శకుడు: కార్తీక్ రాపోలు,

నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా,

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్,

క‌థ‌: మేర్లపాక గాంధీ,

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు,

సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి,

ఎడిటర్: సత్య

రామ్‌మొహ‌న్ (బ్ర‌హ్మ‌జి) కి ఒక్క‌డే కొడుకు సంతోష్ కి చిన్న‌ప్ప‌టి నుండి త‌న డ్రాయ‌ర్ లో ప్రాబ్లం వుంద‌నే సందేహం. ఎన్నిసార్లు చెప్పినా తండ్రి త‌ప్పుగానే ఆలోచిస్తాడు. అందుకే ఎవ‌రికి చెప్ప‌కుండా చిన్న జాబ్ చేస్తుంటాడు. రామ్‌మొహ‌న్ కొడుకి కి పెళ్ళి చేయాల‌ని నిశ్చ‌యించుకుంటాడు. కాని త‌న ఫ్యాంట్ లొ వున్న ప్రాబ్ల‌మ్ వ‌ల్ల పెళ్ళి ని వ‌ద్ద‌నుకుంటాడు. త‌న ప్రాబ్లం ని త‌న స్రేహితుడు ద‌ర్శ‌న్ (సుద‌ర్శ‌న్‌) ని చెప్పుకుంటాడు. అయితే స‌మ‌స్య‌ని పోగోట్టేందుకు సుద‌ర్శ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా సంతోష్‌ తండ్రి ఏమాత్రం విన‌కుండా అమృత (కావ్య‌త‌ప్ప‌ర్ తో పెళ్ళి చేస్తాడు. పెద్ద‌లంద‌రూ శోభ‌నం కి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే, సంతోష్‌, ద‌ర్శ‌న్ లు పోస్ట్‌పోన్ చేసేప‌నిలో వుంటారు. ఈ క్ర‌మంలో అస‌లు సంతోష్ ప్రాబ్లం కి సోల్యూష‌న్ దొరికిందా.. అమృత తో శోభనం అయ్యిందా.. డ‌జ్ సైజ్ మేట‌ర్ అనేది బుల్లి తెర‌పై చూడాల్సిందే..

న‌టీన‌టుల ప‌నితీరు..
మొద‌టిగా హీరో సంతోష్ శోబ‌న్ త‌న పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. త‌న‌కున్న ప్రాబ్లం ని ఎవ‌రికి చెప్పుకొలేక‌, ఫ‌స్ట్ నైట్ ని పోస్ట్ పోన్ చేసుకునే క్ర‌మంలో చాలా బాగా న‌టించి న‌వ్వించి మెప్పించాడు. కావ్య కొత్త అమ్మాయైనా రెండు మూడు సీన్ల త‌రువాత అల‌వాట‌య్యి అమృత గా క‌నిపిస్తుంది. త‌న పాత్ర‌లో చ‌లా చ‌క్క‌గా అందంగా న‌టించింది. బ్ర‌హ్మ‌జి చాలా రొజుల త‌రువాత న‌వ్వించాడు. సుద‌ర్శ‌న్ మాట‌లు చేష్టలు న‌వ్వుని తెప్పిస్తాయి. స‌ప్త‌గిరి లాస్ట్ అరగంట సినిమాలో త‌న స్టైల్ ఆఫ్ కామెడి తో న‌వ్వించాడు. పోసాని కృష్ణ ముర‌ళి, హ‌ర్ష‌వ‌ర్ద‌న్ లు గెస్ట్ అప్పిరెన్స్ లో ప‌ర్వాలేద‌నిపించుకున్నారు. ఇక మిగ‌తా వారంగా పెద్ద‌గా చెప్పుకోన‌క్క‌ర్లేని పాత్ర‌లు..

సాంకేతిక నిపుణులు..
ఈ సినిమా కి పెద్ద పీఠ మాత్రం ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధి కి వేయాలి.. ముఖ్యంగా అంత బోల్డ్ క‌థ‌ని తీసుకుని ఎంట‌ర్ టైనింగ్ గా చెప్ప‌టం క‌ష్ట‌మే, కాని ఆయ‌న మెద‌టి భాగం లో రాసిన మాట‌లు మాత్రం అంద‌ర్ని అల‌రిస్తాయి. సెకండాఫ్ లో వ‌చ్చే ఫ్యామిలి ఫైటింగ్ సీన్‌, హీరో, హీరోయిన్ మ‌ద్య వ‌చ్చే రొమాంటిక్ సీన్‌, ఆ త‌రువ‌త క్లైమాక్స్ లో త‌న డైలాగ్స్ తో క‌న్విన్స్ చేసిన విధానం బాగుంది. అలాగే స్క్రీన్ ప్లే లో క‌థ‌ని మోద‌లు పెట్టిన తీరు చాలా ఎంట‌ర్‌టైనింగ్ వుంది. ద‌ర్శ‌కుడు కార్తిక్ రాపోలు కొత్త‌వాడైనా కొంత వ‌ర‌కు సెకండాఫ్ లో ల్యాగ్ అనిపించినా ఎక్క‌డా కంగారు లేకుండా ఈ సినిమా చేశాడు. సినిమాటోగ్రాఫ‌ర్ చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. చిన్న చిత్రాల్లో ఈ మ‌ధ్య‌కాలంలో ఎవ‌రూ ఇంత క్వాలిటి ఇవ్వ‌లేదు.. మ్యూజిక్ ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు మ్యూజిక్ పెద్ద ఎసెట్ అయ్యింది. ముఖ్యంగా రీ-రికార్డింగ్ చెప్పుకునేలా ఇచ్చాడు. ఎడిటింగ్ ప‌ర్వాలేదు. యువి కాన్సెప్ట్స్ వారి ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంద‌రూ బాగానే చేశారు

పంచ్ లైన్‌.. ఏక్ ప‌ర్ ఫెక్ట్ క‌థ‌‌

రేటింగ్ – 3.25

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు