అంతా అబద్దమే : చిరంజీవికి కరోనా లేదు – కోడలి హాస్పటల్లో తేలిన నిజం

chiranjeevi test corona negative

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది అభిమానులు ఆయన కోసం చేయని పూజ లేదు ఎక్కని గుడి మెట్టు లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆయనకు కరోనా ఎలా వచ్చి ఉంటుంది, ఆయన ఎవరెవరిని కలిసాడు అంటూ అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

ఇంత హంగామా, హాడావుడి జరిగిన తరువాత తెలిసింది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవికి అసలు కరోనా లేదు అని. కరోనా పాజిటివ్ వచ్చి రెండు రోజులైన ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన చిరంజీవి ఉపాసనను సంప్రదించడం, ఆమె వెంటనే అపోలో హాస్పటల్లో టెస్ట్లు చేయించడం వెనువెంటనే జరిగిపోయాయి.

ఆ టెస్టుల్లో చిరంజీవికి కరోనా నెగటివ్ అని తేలింది. ఎందుకైన మంచిదని మరో రెండు ప్రముఖ హాస్పటల్స్ లో సైతం టెస్టులు చేయించగా కరోనా నెగటివ్ అనే వచ్చింది. మూడు సార్లు కరోనా నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న చిరంజీవి ఎక్వయిరీ చేయగా తేలిన అసలు విషయం ఏంటంటే,”మొదటి సారి కరోనా టెస్ట్ చేయించుకున్నప్పుడు వాడిన కరోనా టెస్ట్ కిట్ లో ప్రాబ్లమ్ ఉండటం వల్ల పాజిటివ్ అని వచ్చింది”.

ఏదేమైనా కరోనా మెగాస్టార్ చిరంజీవినే మోసం చేసి అభిమానులను, చిరంజీవిని కలసిన ప్రముఖులను, కుటుంబ సభ్యులను హడలెత్తించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు