8న రాష్ట్రాలతో మోదీ మీటింగ్ – ఉత్కంఠంగా ఉన్న పవన్ అభిమానులు

pavankalyan fans about modi meeting

దేశంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశపై అనేకమంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రమైన ఉఠ్కంటంతో ఎదురుచూస్తున్నారు.

ప్రవన్ అభిమానుల ఉత్కంఠానికి కారణం ఇదే

పవన్ అభిమాను మోదీ నిర్వహించనున్న కరోనా సమావేశం గురించి అంత ఉత్కంఠంగా ఎదురుచూడటానికి కారణం వకీల్ సాబ్ సినిమా. ఎందుకంటే ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ఉంది. ఈ సినిమా కోసం కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే అనేక మంది సినీ ప్రియులు సైతం ఎదురుచూస్తున్నారు.

ఒక వేళ ఏప్రిల్ 8న జరిగే సమావేశంలో మోదీ కనుక థియేటర్లు, షాపింగ్ మాల్స్ పై ఏవైనా ఆక్షంలు విధిస్తే ఎక్కడ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందో అని ఆందోళనపడుతున్నారు.దీనిపై ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ వేదికగా వందలాది మీమ్స్ సైతం ఫుల్ గా తిరిగేస్తున్నాయి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు