హీరోయిన్ రష్మిక ఆస్తి విలువ ఎంతో తెలుసా ?

assets and networth of rashmika madanna

హీరోయిన్ ర‌ష్మిక‌, ఈ బ్యూటీ అందాన్ని చూడ‌గానే అబ్బాయిలు తెగ సిగ్గుప‌డిపోతారు. అబ్బ‌బ్బా ఎంత ముద్దుగున్నాదే అంటూ పాట కూడా పాడేస్తారు. అంత‌టి త‌ర‌గ‌ని సోయగం ర‌ష్మిక సొంతం. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఒక్క టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ ఇలా అన్ని సినీ ఇండ‌స్ట్రీల్లో న‌టిస్తూ కుర్ర‌కారును బుట్ట‌లో వేసుకుంది. ఇదిలా ఉండ‌గా, ర‌ష్మిక ఆస్తుల గురించి ఓ క‌థ‌నం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ అందాల హీరోయిన్ తాను కోరుకున్న‌ది ద‌క్కే వ‌ర‌కు వ‌ద‌ల‌ద‌ట‌. అవ‌స‌రాల కోసం ఎంతైనా ఖ‌ర్చు పెడుతుందంటూ సినీవ‌ర్గాల టాక్. మొత్తానికి ఒక యువ‌రాణిలా త‌న జీవితాన్ని ర‌ష్మిక ఎంజాయ్ చేస్తుంద‌ట‌. అలాగే ఈ బ్యూటీకి కార్లంటే తెగ ఇష్ట‌మ‌ని తెలుస్తుంది. క‌నుక‌నే ర‌ష్మిక ఇంటి గ్యారేజీలో ఖ‌రీదైన కార్లు ఉన్నాయి. ఆడి క్యూ 3, మెర్సిడిస్‌ బెంజ్‌ సీ క్లాస్‌, రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ, ఇన్నోవా క్రిస్టా, హ్యుండాయ్‌ క్రెటా వంటి ఖ‌రీదైన కార్లు ర‌ష్మిక ఇంటి గ్యారేజీలో ఉన్నాయి. తాను కొనుక్కున్న ఖ‌రీదైన కార్ల‌లో, బ‌య‌ట‌కు షికారుకు వెళ్లే స‌మ‌యంలో, అప్ప‌టిక‌ప్పుడు త‌న మూడ్‌ను బ‌ట్టి సెలెక్ట్ చేసుకున్న కారులో వెళుతుంది.

ఇటీవ‌ల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక, ముంబైలోని హోట‌ళ్ల‌లో ఉండ‌లేక అక్క‌డే సొంతంగా ఇళ్లు కూడా కొనుక్కుంది. ర‌ష్మిక‌కు బెంగళూరులోనూ ఓ పెద్ద ఇళ్లు ఉంది. 6 నుంచి 8 కోట్ల రూపాయ‌ల విలువ చేసే విల్లా సైతం ఉంది. ఇక‌, ర‌ష్మిక మంద‌న్నాకు హ్యాండ్‌ బ్యాగ్స్‌ అంటే పిచ్చ‌నే చెప్పాలి. వాటి ప‌ట్ల అంత ఇష్టాన్ని చూపుతుంది. న‌చ్చిన హ్యాండ్ బ్యాగ్‌ను కొనేందుకు ఎంతైనా ఖ‌ర్చు పెడుతుంది. అలాగే ర‌ష్మిక త‌న కాస్ట్యూమ్స్‌ కోసం కూడా బాగానే డ‌బ్బులు ఖర్చు చేస్తుంద‌ని సినీ వ‌ర్గాల టాక్.

ఇదిలా ఉండ‌గా, ర‌ష్మిక బాలీవుడ్‌లో న‌టిస్తున్న గుడ్ బై సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే ఆమెకు అక్క‌డ సినీ ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయ‌ని, ఒక్క సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయ‌లు కూడా ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీ అంటున్న‌ట్టు తెలుస్తుంది. అలాగే బుల్లితెర‌పై వ‌చ్చే వాణిజ్య ప్రకటనల కోసం 15 ల‌క్ష‌ల నుంచి 25 లక్షల రూపాయ‌ల వ‌ర‌కు ర‌ష్మిక‌కు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధ‌ప‌డుతున్నాయి. మొత్తంగా ర‌ష్మిక మంద‌న్నా ఆస్తి 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయ‌లుగా ఉన్నట్లు స‌మాచారం. అయితే మనం ఊహించినదానికన్నా ఎక్కువ ఆస్తి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ఆమె అభిమానులు. మొత్తానికి తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంటూ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను అనుభవిస్తోందీ హీరోయిన్ ర‌ష్మిక‌..!

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు