తెలుగులో మరో కొత్త ఛానెల్ – గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న తెలుగు వ్యక్తి

one more news channel in telugu to be launched by sony india

తెలుగు రాష్ట్రాల్లో వినోదానికి ఎంతో డిమాండ్ ఉంది. పదేళ్లుగా నాలుగే నాలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లు నడుస్తున్నాయి. ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు.. ఈ నాలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లే దిక్కు అయ్యాయి. సినిమాలు, సీరియల్స్ తప్పితే వీటిలో కొత్తగా వచ్చే ప్రోగ్రామ్స్ ఏమీ లేకపోవటం.. రెగ్యులర్ గా చూసే ఛానల్సే కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ లో ఏర్పడింది. ఇలాంటి ఫీలింగ్ పబ్లిక్ లో ఉందని.. లాక్ డౌన్ సమయంలో స్పష్టం అయిపోయింది. అందుకే వినోద ప్రియులు అందరూ ఓటీటీ బాట పట్టారు. వెబ్ సిరీస్ హవా నడిచింది.

ఏపీ, తెలంగాణలో ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ కు డిమాండ్ ను గుర్తించిన ప్రపంచ టాప్ కంపెనీ సోనీ టీవీ.. తెలుగులో ఛానల్ తీసుకు రాబోతున్నది. వెయ్యి కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలతో సరికొత్తగా తీసుకురావాలని నిర్ణయించింది. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ తోపాటు.. సోనీ ఓటీటీ పేరుతో రెండూ ఒకేసారి లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి వర్క్ చకచకా జరుగుతుంది.

తెలుగు సోనీ టీవీని లీడ్ చేసే వ్యక్తుల ఎంపిక సైతం ఇప్పటికే జరిగిపోయినట్లు సమాచారం. ఓ కన్నడ ఛానల్ లో హెడ్ గా ఉన్న తెలుగు వ్యక్తిని సోనీ కంపెనీ సీఈవోగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టకుండా సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ తో రావాలని నిర్ణయించటంతోపాటు.. అందుకు తగ్గట్టు కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఛానల్ తోపాటు ఓటీటీకి ప్రాధాన్యత ఇస్తూ.. రెండింటినీ మిక్స్ చేసి.. ప్రోగ్రామ్స్ రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయంగా సోనీ ఛానల్ కు ఉన్న అనుభవం, తెలుగు మార్కెట్ లో ఉన్న స్పేస్, రెవెన్యూపై క్లారిటీతో ఉన్న కంపెనీ.. లేటుగా అయినా లేటెస్ట్ గా వస్తాం అంటోంది. ఇప్పటికే మా టీవీ స్టార్ టేకోవర్ చేసింది.. జీ కూడా నేషనల్ బ్రాండ్.. జెమినీ సైతం నేషనల్ బ్రాండ్.. ఒక్క ఈటీవీ మాత్రమే లోకల్.. ఇప్పుడు సోనీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ కింద వస్తుంది. అంటే తెలుగోళ్లు ఎవరికీ ఎంటర్ టైన్ మెంట్ పెట్టే ఆలోచన, మార్కెట్ వ్యాల్యూ తెలియదు అని స్పష్టం అవుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు