ప్రభాస్‌ ఆదిపురుష్‌ విడుదల ఎప్పుడంటే – డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

prabhas adipurush movie release date

టాలీవుడ్ బాహుబలి, యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్‌ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీపై ఫ్యాన్స్‌కు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ప్రస్తుతం పూజాహెగ్డేతో రాధేశ్యామ్ అంటున్న ప్రభాస్‌.. తర్వాత భారీ ప్రాజెక్ట్‌ ఆదిపురుష్‌పై అధికారిక ప్రకటన చేశారు. పాన్ ఇండియా మూవీగా.. ఏకంగా 400 కోట్లతో నిర్మిస్తున్న ఆదిపురుష్‌ సినిమా ప్రీ పొడక్షన్ వర్క్స్‌ స్టార్ట్‌ అయినట్లు స్పష్టం చేశారు. దీనిపై మూవీ యూనిట్‌ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రామాయణం ఇతివృత్తంగా వస్తున్న ఈ మూవీకి సెన్షేషనల్ డైరెక్టర్ ఓం రావుత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.

అనౌన్స్‌మెంట్‌ రోజే విడుదల తేదీ ప్రకటన

ఇక ఆదిపురుష్‌ గురించి చాలాకాలం నుంచే వార్తలు లీకవుతున్నా.. ఇవాళ అధికారిక ప్రకటన చేశారు. అంతేనా.. మూవీ గురించి అనౌన్స్‌మెంట్‌ చేసిన రోజే రిలీజ్‌ డేట్‌ను కూడా చెప్పేశారు. 2021 ప్రారంభంలో మూవీనిసెట్స్‌పైకి తీసుకెళ్తామన్న యూనిట్.. ఆగస్టు 11, 2022 న దేశవ్యాప్తంగా విడుదల చేస్తామని.. ట్విట్టర్‌లో ప్రకటించింది. 3 డీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం.. హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. అవతార్, స్టార్‌ వార్స్‌ సినిమాలకు చేసిన ఎక్స్‌పర్ట్స్‌తో.. వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

ఆదిపురుష్ కోసం ప్రభాస్ వర్కౌట్స్‌.

ఓ వైపు రాధేశ్యామ్‌ అంటున్న ప్రభాస్‌.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేతో.. మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. అయితే ఆదిపురుష్‌లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్‌.. అందుకు అనుగుణంగా వర్కౌట్స్‌ మొదలు పెట్టినట్లు డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెలిపారు. అంతేకాకుండా.. క్లైమాక్స్‌ వచ్చే సన్నివేశాల కోసం.. ప్రత్యేకంగా విలువిద్యను కూడా నేర్చుకుంటున్నారని వివరించారు.

ఆదిపురుష్ : సీత పాత్రలో నటించేదెవరు..?

ఇక ప్రభాస్ సరసన సీత పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై చాలా మంది హీరోయిన్లు తెరపైకి వచ్చారు. మహానటి కీర్తిసురేష్‌తో పాటు.. అనుష్క, అనుష్క శర్మ, కృతీ సనన్‌ పేర్లు కూడా వినబడ్డాయి. అయితే సీత క్యారెక్టర్‌ ఎవరు చేస్తారనే దానిపై మూవీ యూనిట్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

యూత్‌ కనెక్ట్‌ అవుతుందంటున్న ప్రభాస్‌

తన్హాజీ తర్వాత ఓం రౌత్‌తో చేస్తున్న రెండో సినిమా ఇదని.. ఆదిపురుష్‌లో నటించేందుకు ఎదురుచూస్తున్నట్లు సైఫ్ చెప్పారు. గొప్ప విజన్ ఉన్న దర్శకుడని.. సాంకేతికంగా ఆదిపురుష్‌ అద్భుతంగా ఉండబోతుందని.. సైఫ్ అంటున్నారు. మూవీ స్క్రీన్‌ ప్లే అద్భుతంగా ఉందని.. భారతీయ ప్రజలందరికీ ఈ మూవీ నచ్చుతుందని.. ప్రభాస్ తెలిపారు. ముఖ్యంగా యూత్‌ ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతారని చెప్పుకొచ్చారు.

భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీని భూషణ్ కుమార్, క్రిషన్‌ కుమార్, టీ సిరీస్‌, ఓం రౌత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్‌ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారని చెబుతున్నారు. పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాను హిందీ, తెలుగులో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ మూవీని.. తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదల చేయనున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు