శ్రీముఖి మెడలో శిలువ – ఫ్యాషన్ కోసమేనా : షర్మిళను కలవడానికి తీవ్రంగా ప్రయత్నం

శ్రీముఖి మెడలో శిలువ.. మతం ఏమైనా..

హాట్ బ్యూటీ.. నటి అయిన శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రోజూ తన అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలని తపిస్తూ ఉంటారు. రోజూ ఏదో ఫొటోలు పెడుతూ.. ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటారు.

రీసెంట్ గా శ్రీముఖి నుంచి వచ్చిన కొన్ని ఫొటోలు చర్చకు దారి తీశాయి. ఆ ఫొటోల్లో శ్రీముఖి మెడలో శిలువ గుర్తు ఉంది. శ్రీముఖి మెడలోనే శిలువ గుర్తు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. బంగారంతో చేసిన లాకెట్ లా ఉంది. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. శ్రీముఖి మెడలో శిలువ.. మతం ఏమైనా మారిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శ్రీముఖి సహజంగా హిందువూ. ఇటీవల హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటి నిర్మాణ పూజలు చేశారు. నటి కావటంతో.. ప్రతి పండక్కి.. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా పర్వదినాలకు ఆయా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ వస్తారు. ఇది రొటీన్ అయినా.. సమయం, సందర్భం ఏమీ లేకుండా శ్రీముఖి మెడలో శిలువ గుర్తు ప్రత్యక్షం కావటం ఆశ్చర్యానికి, అనుమానాలకు తావిస్తోంది.

శ్రీముఖి మెడలో శిలువ గుర్తు ఫ్యాషన్ కోసం అయితే పర్వాలేదు.. షూటింగ్ కోసం అయితే ఓకే.. అలా కాకుండా ఇంకేమైనా ఉందా అనే క్వశ్చన్ అభిమానుల నుంచే వస్తుంది. ఎంత ఫ్యాషన్ అయినా ఆయా మతాల వారి మనోభావాలకు విరుద్ధంగా వాడుకోవటం తప్పేకదా.. ఎందుకంటే.. హిందూ దేవుళ్ల బొమ్మలను వివిధ వస్తువులపై వినియోగించే విదేశీయులపై హిందూవులు ఎలా ఆగ్రహం చేస్తారో.. అలాగే ఇప్పుడు ఫ్యాషన్ కోసం మరో మతం దేవుడికి వాడుకోవటం అంటే.. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు వాళ్లు..

ఇటీవల మరో వార్త సైతం చక్కర్లు కొట్టింది. వైఎస్ షర్మిల కొత్తగా పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి శ్రీముఖి వెళుతుందని.. ఈ మేరకు వైఎస్ షర్మిలతో భేటీ అవుతుంది అనే వార్తలు వచ్చాయి. ఎందుకో మరి.. ఆ తర్వాత వీరి భేటీ జరగలేదు. అదే సమయంలో నటి, యాంకర్ శ్యామల ఒక్కరే షర్మిలతో భేటీ అయ్యారు.

ఈ ఈక్వేషన్స్ అన్నీ పరిశీలించిన తర్వాత శ్రీముఖి మెడలో శిలువ గుర్తు లాకెట్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఆమె అభిమానుల నుంచి వచ్చిన డౌట్స్ ఇలా ఉంటే.. దీనిపై శ్రీముఖి ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు