మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ షెట్ డౌన్ : థియేటర్లు మూసివేత షూటింగ్స్ బంద్..

తెలుగు సినీ ఇండస్ట్రీ షెట్ డౌన్.. ధియేటర్లు మూసివేత.. షూటింగ్స్ బంద్..

తెలుగు సినిమా ఇండస్ట్రీ షెట్ డౌన్ అయ్యింది. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో.. తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించటంతో.. ఏప్రిల్ 20వ తేదీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా ధియేటర్లను 21వ తేదీ అంటే బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సింగిల్ ధియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ లు సైతం మూతపడనున్నట్లు ప్రకటించింది ధియేటర్ ఓనర్స్ అసోసియేషన్.

ప్రముఖ వ్యక్తులు, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతుండటంతో షూటింగ్స్ అన్నీ నిలిపివేయాలని నిర్ణయించింది తెలుగు సినీ ఇండస్ట్రీ. సోనూసుద్ కు పాజిటివ్ రావటంతో.. ఆచార్య షూటింగ్ ను ఆపేశారు. అదే విధంగా మిగతా సినీ షూటింగ్స్ అన్ని క్లోజ్ చేయాలని నిర్ణయించింది ఇండస్ట్రీ. మే ఒకటో తేదీ వరకు అన్ని సినిమా, సీరియల్ షూటింగ్స్ బంద్ చేయటం ద్వారా కొంత మేరకు కట్టడి చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా ఎవరికి ఉంది.. ఎవరికి లేదు అనేది ఎవరికీ తెలియటం లేదు. లక్షణాలు బయటకు రాకుండానే వైరస్ శరీరంలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్స్ కొనసాగించటానికి హీరోలు, హీరోయిన్స్, ఇతర నటులు భయపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సినిమా, సీరియల్ షూటింగ్స్ పది రోజులు నిలిపివేయాలని డిసైడ్ అయ్యింది.

కరోనా కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీ షెట్ డౌన్ కావటం ఇది రెండోసారి. గత ఏడాది ఏకంగా నాలుగు నెలలు షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ షెట్ డౌన్ కావటంతో సినీ కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మే ఒకటో తేదీన అయినా తిరిగి షూటింగ్స్ ప్రారంభం అవుతాయా లేదా అనేది డౌట్ గానే ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు