రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేదంటే చస్తారా? పలువురికి బెదిరింపులు

కాశ్మీర్ నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ పలువురు నేతలను హెచ్చరించింది. 17 మంది పేర్లతో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రమణ్ భల్లాకు లేఖ రాశారు ఉగ్రవాదులు. వీరిలో బీజేపీ నేతలతో పాటు మాజీ మంత్రులు, ఆర్ఎస్ఎస్ నాయకుల పేర్ల సహా ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన పేర్లు ఉన్నాయి. ఈ లేఖపై హిజ్బుల్ డివిజినల్ కమాండ్ సంతకం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ లేఖ సారాంశం.. రాజకీయాలకు దూరంగా ఉంది తనకు మద్దతు తెలపాలని హిజ్బుల్ లేఖలో పేర్కొంది లేదంటే డెత్ వారెంట్లు తప్పవని హెచ్చరించింది. తమ నుంచి ఎవరూ కాపాడలేరని తెలిపారు. అంతేకాదు, తమ టార్గెట్‌లోకి వచ్చిన వారిని వారి ఇళ్లలోనే కాల్చి చంపుతామని హెచ్చరికలు జారీ చేసింది. ఎర్రకోటపైనే దాడిచేసిన తమను మిమ్మల్ని హతమార్చడం పెద్ద లెక్క కాదని పేర్కొంది. కాగా, ఈ లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హిజ్బుల్ ఉగ్రవాద సంస్థపై ఉపా చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా గతంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను ముష్కరులు హత్యచేసిన విషయం విదితమే.. ఈ లేఖ రావడంతో పలువు నాయకులు ఆలోచనలో పడ్డారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి