KPHB లో దారుణం : చదువుకోలేదని కొడుక్కి నిప్పంటించిన తండ్రి

The father who set fire to the uneducated son

హైదరాబాద్ లోని కేపీహెచ్​బీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. సరిగ్గా చదువుకోవడంలేదని కోపోద్రిక్తుడు అయిన తండ్రి క్షణికావేశంలో కొడుపై టర్పెంట్ ఆయిల్ పోసి నిప్పంటించాడు. నాగర్​కర్నూలు జిల్లాకు చెందిన బాలు కుటుంబం, కేపీహెచ్​బీ కాలనీలోని రోడ్ నంబర్ 2లో ఉన్న మండల ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. బాలు భార్య సోనీ పాఠశాలలో అటెండర్ పనిచేస్తుండగా, వారి చిన్న కుమారుడు 12 ఏళ్ల చరణ్ అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

KPHB లో దారుణం : చదువుకోలేదని కొడుక్కి నిప్పంటించిన తండ్రి

కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటున్న చరణ్ ఆన్​లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. ఆదివారం నాడు రాత్రి టీవి చూస్తున్న చరణ్​ను తండ్రి బాలు బీడీలు తీసుకుని రమ్మని పంపించాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన చరణ్‌ని సరిగ్గా చదవటం లేదని, తరగతులకు హాజరవ్వటం లేదని చితకబాదాడు. అదే సమయంలో బాలుడిని కొట్టవద్దంటూ తల్లి సోనీ అడ్డుపడింది.

చరణ్ ను కొడుతున్న సమయంలో తల్లి సోనీ అడ్డు రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలు గుడిసెలో ఉన్న టార్పెంటాయిల్ ను కుమారుడిపై పోసి నిప్పంటించాడు.ఒక్కసారిగా శారీరం మొత్తం మంటలు వ్యాపించడంతో తట్టుకోలేని చరణ్ ఇంట్లో నుండి పరుగులు తీసి పాఠశాల వెనుకవైపు ఉన్న గోతిలో పడిపోయాడు. చరణ్ అరుపులు విన్న స్థానికులు మంటలను ఆర్పి స్థానిక హాస్పటల్ కు తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో చరణ్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు