నగరంలో ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్

నగరంలో ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్

ఇతర విభాగాల ఉద్యోగులంటే గౌరవం లేకుండా ప్రవర్తించిన ముగ్గురు కానిస్టేబుల్స్ పై వేటు పడింది. హైదరాబాద్ నగరంలోని కామాటిపురా ప్రాంతంలోని దేవిబాగ్‌లో మంగళవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ సిబ్బంది వరద బాధితులకు సీఎం తక్షణ సాయం రూ.10వేలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాబురావు అనే కానిస్టేబుల్ కుటుంబానికి 10 వేల రూపాయలు ఇచ్చారు.

అదే కుటుంబం నుంచి అతడి కొడుకులు వచ్చి తమకు డబ్బు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. ఒకే కుటుంబానికి రెండు సార్లు ఇవ్వడం కుదరదని జీహెచ్ఎంసీ అధికారులు తేల్చి చెప్పారు. దింతో అధికారులతో ఘర్షణకు దిగారు కానిస్టేబుల్ కొడుకులు వీరికి సాయంగా పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ కూడా వచ్చాడు. దింతో పలువురికి గాయాలయ్యాయి.

విషయం సీపీ అంజనీకుమార్ దృష్టికి వెళ్ళింది. జవాబుదారితనంతో కూడిన ఉద్యోగంలో ఉంటూ హద్దు మీరిన వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బహదూర్‌పురా కానిస్టేబుల్‌ బాబూరావు, చిలకలగూడ ఠాణా కానిస్టేబుల్‌ గంటిపేక సుధాకర్‌, సిటీ ఆర్మూడ్‌ రిజర్వులో కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్న మందుల శరత్‌కుమార్‌లను సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి