టిక్ టాక్ అభిమానులకు తీపి కబురు.. యూట్యూబ్ లో టిక్ టాక్ తరహా ఆప్షన్

టిక్ టాక్ భారతీయులను ఎంతగానో ఆకర్షించిన విషయం తెలిసిందే.. చైనాతో దౌత్యసంబందాలు దెబ్బ తినడం. భారత పౌరుల డేటాకు ప్రమాదం పొంచిఉండటంతో భారత ప్రభుత్వం దానిని బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే అటువంటి యాప్స్ తీసుకురావడానికి చాలా సంస్థలు తీవ్రగా శ్రమిస్తున్నాయి.. మార్కెట్లోకి అటువంటి యాప్స్ వచ్చినా అవి పెద్దగా క్లిక్ అవలేదు.. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్
షార్ట్‌ వీడియో ఫార్మాట్‌లో ‘షార్ట్స్‌’ పేరిట భారత్‌లో కొత్త ఫీచర్‌ను ప్రారంభించడానికి సిద్ధమైంది.

మరికొన్ని రోజుల్లో భారత్‌లో ప్రయోగాత్మకంగా బీటా వర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్ల ద్వారా చిన్నపాటి వీడియోలు తీసుకుని పోస్ట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని యూట్యూబ్ తెలిపింది.15 సెకన్ల నిడివితో ఉండే క్రియేటివ్ వీడియోలను తీసుకుని తమను తాము యూజర్లు కొత్తగా పరిచయం చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి