కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27 వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా పరిస్థితుల దృష్ట్యా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నడూ లేని రీతిలో శ్రీవారి ఉత్సవాలను ఈసారి ఏకాంతంగా జరపనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అధికారులు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే, 2019 వరకు ఏపీ ప్రభుత్వం తరుపున స్వామి వారికి గరుడసేవ రోజున పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వచ్చారు. కానీ, 2020లో మాత్రం బ్రహ్మోత్సవాల మొదటి రోజున ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ పట్టు వస్త్రాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి సమర్పించనున్నారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి