భక్తులకు శుభవార్త టోకెన్లు ఇచ్చిన టీటీడీ

భక్తులకు శుభవార్త టోకెన్లు ఇచ్చిన టీటీడీ

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునే వారికీ శుభవార్త చెప్పింది టీటీడీ. నేటి నుంచి సర్వసర్షనం టోకెన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రోజు 3 వేల టోకెన్లు ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు 3 వేల చొప్పున ఉచిత టోకెన్‌లను ఇస్తుండటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు కౌంటర్ల దగ్గర బారులు తీరారు. ప్రారంభించిన రెండు గంటల వ్యవధిలోనే టోకెన్‌లు అయిపోయాయి. కరోనా నేపథ్యంలో నిషేధం విధించిన సర్వదర్శనం ఏడు నెలల తర్వాత లభిస్తుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి