టీవీ సీరియల్ నటి శ్రావణి మృతి కేసులో నిర్మాతకు నోటీసులు

గత వారం టీవీనటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే శ్రావణి ప్రేమికులైన దేవరాజ్, సాయికృష్ణా రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సోమవారం ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపారు. కేసు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో అశోక్ రెడ్డి, శ్రావణి మాట్లాడుకుంటున్న ఆడియో బయటకొచ్చింది.

దేవరాజ్ వద్ద వీళ్లిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని అడ్డు పెట్టుకుని శ్రావణిని దేవరాజ్ బెదిరిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో శ్రావణి కేసులో అశోక్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది, ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాబట్టగలం అనే కోణంలో పోలీసులు అడుగులు వేస్తున్నారు. కాగా దేవరాజ్, సాయి కృష్ణాలను ఒకే దగ్గర ఉంది పోలీసులు విచారిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి