ఈతకు వెళ్లిన నేవీ ఉద్యోగులు – ఒకరు మృతి.. మరొకరు గల్లంతు
ఈత సరదా ఇద్దరు ఉద్యోగుల నిండు ప్రాణాలు తీసింది. ఈ విషాధ ఘటన ఆదివారం విశాఖపట్నం యారాడ బీచ్ లో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో కి చెందిన వాహేన్ భమ్, మణిపూర్ రాష్ట్రం బిష్ణుపూం గ్రామానికి చెందిన జగ్జీత్ సింగ్ విశాఖపట్నం నావికాదళంలో ఉద్యోగం చేస్తున్నారు.
ఆదివారం ఆటవిడుపుగా ఉంటుందని ఈత కొట్టడానికి యారాడ బీచ్ కు చేరుకున్నారు. సరదాగా ఈతకొడుతున్న వారు సముద్ర అలలు భీకరంగా రావడంతో గల్లంతయ్యారు. ఇందులో వాహేన్ భమ్ జగ్జీత్ సింగ్ మృతదేహం లభించగా, వాహేన్ భమ్ మృతదేహం కోసం నేవీ హెలీకాఫ్టర్ లో గాలింపు చర్యలు చేపట్టింది.కేసు నమోదు చేసుకున్న న్యూపోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి