ఇంగ్లాండ్ మొత్తం నిత్యావసరాల కొరత.. మార్కెట్లు ఖాళీ

ఇంగ్లాండ్ మొత్తం నిత్యావసరాల కొరత.. మార్కెట్లు ఖాళీ.. ఇంగ్లాండ్ దేశం చుట్టూ లక్షల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని నిల్వలు అన్నింటినీ ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయటంతో.. రాబోయే వారం

UKlockdown By New Coronavirus Strain
UKlockdown By New Coronavirus Strain

కరోనాకు మరో రూపంగా వస్తున్న స్ట్రయిన్ వైరస్ తో బ్రిటన్ అల్లాడిపోతుంది.. స్ట్రయిన్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంగ్లాండ్ దేశం లాక్ డౌన్ ప్రకటించింది. ఇతర దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించటంతో.. భారత్ తో సహా అనేక దేశాలు ఇంగ్లాండ్ కు విమాన సర్వీసులను నిలిపివేశారు. మనకే ఇలా ఉంటే.. ఇక బ్రిటన్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు కనెక్ట్ అయ్యే అన్ని రహదారులను మూసివేయటంతో.. లక్షలాది ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

లాక్ డౌన్ ప్రకటించటంతో ప్రజలు అందరూ ఒక్కసారిగా సూపర్ మార్కెట్లపై పడ్డారు. పెద్ద ఎత్తున నిత్యావసరాలు కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్లు అన్నీ ఖాళీ అయిపోయాయి. చెత్త సరుకును సైతం వదలకుండా తీసుకెళ్లారు. చివరగా వచ్చిన వారికి ఏమీ దొరకలేదు. కొత్త సరుకు రావటానికి అవకాశం లేకపోవటంతో.. చాలా ప్రాంతాల్లో ఆహార సంక్షోభం ఏర్పడింది.

ఫ్రాన్స్, సిడ్నీ, టర్కీ, ఐర్లాండ్ దేశాల నుంచి వచ్చే అన్ని సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధించటంతో.. ఇంగ్లాండ్ దేశం చుట్టూ లక్షల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని నిల్వలు అన్నింటినీ ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయటంతో.. రాబోయే వారం రోజుల్లో నిత్యావసరాల కొరత ఏర్పడనున్నట్లు భయపడుతోంది దేశం.

రవాణా వాహనాలపై ఆంక్షలను మూడు రోజుల తర్వాత తొలగించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత పరిస్థితి ఏంటీ అనేది ఎవరికీ అంతుచిక్కటం లేదు.

అసలే క్రిస్మస్ సెలవులు.. ఇప్పటికే భారీ ఎత్తున సెలబ్రేషన్స్ కోసం ప్లాన్ చేసుకున్న వారు ఇప్పుడు ఇంటి దారి పట్టారు. దీంతో బస్సులు, రైళ్లు, విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. స్ట్రయిన్ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ఇబ్బంది పడక తప్పదని ప్రభుత్వం భావించింది. లేకపోతే కరోనా వైరస్ కంటే ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి