జిల్లాల వారీ జెడ్పీటీసీ – ఎంపీటీసీల ఎన్నికల వివరాలు సమగ్రంగా..

జిల్లాల వారీ జెడ్పీటీసీ - ఎంపీటీసీల ఎన్నికల వివరాలు సమగ్రంగా..

zptc mptc
zptc mptc

జిల్లాల వారీ జెడ్పీటీసీ – ఎంపీటీసీల ఎన్నికల వివరాలు సమగ్రంగా..

ఏప్రిల్ 8వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. పరిషత్ ఎన్నికల క్రమంలో.. ఏప్రిల్ 8వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 2 కోట్ల 82 లక్షల 15 వేల 104 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లా వారీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, అభ్యర్థుల వివరాలు సమగ్రంగా చూద్దాం..

శ్రీకాకుళం జిల్లా : 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
విజయనగరం జిల్లా : 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
విశాఖపట్నం జిల్లా : 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
తూర్పుగోదావరి జిల్లా : 61 జెడ్పీటీసీ, వెయ్యి (1,000) ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
పశ్చిమగోదావరి జిల్లా : 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

కృష్ణా జిల్లాలో 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
గుంటూరు జిల్లాలో 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
ప్రకాశం జిల్లా 41 జెడ్పీటీసీ, 367 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
నెల్లూరు జిల్లాలో 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

చిత్తూరు జిల్లాలో 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
కడప జిల్లాలో 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
కర్నూలు జిల్లాలో 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
అనంతపురం జిల్లాలో 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

మొత్తంగా 652 జెడ్పీటీసీ, 9 వేల 714 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ జరగనుంది
పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోయిన స్థానాల్లో పోలింగ్ వాయిదా వేసిన ఎన్నికల సంఘం

జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2 వేల 092 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు
ఎంపీటీసీ ఎన్నికల బరిలో 19 వేల 002 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు
ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2 వేల 371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
పరిషత్ ఎన్నికల కోసం 33 వేల 663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు