నెల తర్వాత జెడ్పీ ఎన్నికలు పెడితే గెలుస్తామా.. నిజం చెప్పండి.. తెలుగు తమ్ముళ్ల ఆత్మఘోష

నెల తర్వాత జెడ్పీ ఎన్నికలు పెడితే గెలుస్తామా.. నిజం చెప్పండి.. తెలుగు తమ్ముళ్ల ఆత్మఘోష

TDP babu
TDP babu

పరిషత్ ఎన్నికలకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై తెలుగుదేశం పార్టీ గుర్రుగా ఉంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జెడ్పీ ఎన్నికల పోలింగ్ జరిగే ఏప్రిల్ 8వ తేదీనే సుప్రీంకోర్టులో.. హైకోర్టు తీర్పును సవాల్ చేయనుంది టీడీపీ. ఇప్పటికే టీడీపీ నేత బృందం ఢిల్లీ వెళుతుంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో సుప్రీంకోర్టు అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. నాలుగు వారాల గడువు ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. అదే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే.. సుప్రీంకోర్టు అందుకు అనుగుణంగా.. టీడీపీకి పాజిటివ్ గా తీర్పు ఇస్తే.. జెడ్పీ ఎన్నికలకు నాలుగు వారాల గడువు ఇస్తే.. అప్పుడైనా గెలుస్తామా.. అనే పాయింట్ పై టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తల్లో చర్చ మొదలైంది.

ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. పోటీ నుంచి తప్పుకున్న తర్వాత.. హైకోర్టు ఎన్నికలకు ఓకే చెప్పిన తర్వాత.. సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించేది ఏంటీ అనే ప్రశ్న సైతం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. నాలుగు వారాల తర్వాత అయినా గెలుస్తాం అని అనుకుంటే దేనికైనా పోరాటం చేయొచ్చు.. అలా కాకుండా ఇలా కోర్టు ద్వారా సాధించినందున పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటీ అంటున్నారు.

నాలుగు వారాల తర్వాత జెడ్పీ ఎన్నికలు పెడితే.. ఓటమి నాలుగు వారాల తర్వాత వస్తుంది.. అదేదో ఇప్పుడు జరిగిపోతే ఓ పని అయిపోతుంది.. ఈ గోల ఎందుకు.. ఇప్పటికైనా కోర్టుల ద్వారా పోరాటం కంటే.. ప్రజల కోసం.. ప్రజల్లో ఉండి పోరాటం చేసే వ్యూహాలు, పార్టీ ప్రక్షాళన చేయాలని కరుడుగట్టిన టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.

See also : ఈ ఒక్క ప్రశ్నతో హైకోర్టులో ఖంగుతిన్న టీడీపీ లాయర్లు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు