చంద్రబాబస్ స్టేట్మెంట్ టు బహిష్కరణ zptc and mptc ఎన్నికలు

చంద్రబాబు స్వయంగా ప్రకటించటం చూసి షాక్ అయ్యారు అభ్యర్థులు.

చంద్రబాబు స్వయంగా ప్రకటించటం చూసి షాక్ అయ్యారు అభ్యర్థులు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన కార్యకర్తలు, నేతల్లో ప్రకంపనలు రేపుతోంది.

నామినేషన్ల ప్రక్రియ మొత్తం పూర్తయ్యి.. బీ-పాం సైతం సమర్పించిన తర్వాత మధ్యలో ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు పోటీలోనే అభ్యర్థులు.

ఆరు రోజులు ప్రచారం చేస్తే పోలింగ్ ముగుస్తుంది.. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాం.. ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చాం.. ఇలాంటి టైంలో.. మధ్యలో వెనక్కి వెళ్లాలి అంటే స్థానికంగా చులకన అవుతాం అంటున్నారు కార్యకర్తలు, నేతలు.

టీడీపీ అభ్యర్థి బరిలో లేరని.. ఓటర్లు అందరూ గమనించాలని పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించటం చూసి షాక్ అయ్యారు అభ్యర్థులు.

గెలిచినా.. ఓడినా పోటీ చేసి ఉంటే బాగుండేదని.. అర్థాంతరంగా మధ్యలో.. నడి సముద్రంలో వదిలేయటం అంటే తప్పుడు సంకేతాలు వస్తాయని అభ్యర్థులు లబోదిబో అంటున్నారు.

బహిష్కరణపై బహిరంగంగా ప్రకటన చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ అభ్యర్థులు.

see also : కోర్టుల్లో పోరాడతాం.. ఎన్నికలు బహిష్కరణ – చంద్రబాబు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు