కోటి రూపాయలు గెలుచుకున్న ఐపీఎస్ అధికారిని.. ఏడు కోట్ల ప్రశ్న సస్పెన్స్

కోటి రూపాయలు గెలుచుకున్న ఐపీఎస్ అధికారిని.. ఏడు కోట్ల ప్రశ్న సస్పెన్స్

కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ ప్రోగ్రాం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోలో కోటీశ్వరుడు కావాలంటే చాలా కష్టం.. కోడి రూపాయలు గెలుచుకోవాలంటే ఎంతో తెలివి ఉండాలి.. దానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. ఇక ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 12 వ సీజన్ నడుస్తుంది..

ఈ సీజన్ లో తొలిసారి కోటిరూపాయలు గెలుచుకొని నజియా నసీమ్ అనే మహిళ రికార్డ్ సృష్టించగా. తాజాగా ఐపీఎస్ అధికారిని మోహితా శర్మ కోటిరూపాయలు గెలుచుకొని రెండవ కంటెస్టెంట్ గా నిలిచారు. ఈ విషయాన్నీ సోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. ఇక ఈమె ఏడూ కోట్ల ప్రశ్నవరకు వెళ్లారు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారా లేదా అనేది తెలియదు.

దానిని సస్పెన్స్ లో ఉంచుతూ ట్విట్ చేశారు. మరి 7కోట్లు గెలచుకునే ఆ ప్రశ్న ఏమయ్యింటుంది? మోహితా శర్మ సమాధానం చెప్పిందా లేక వెనుతిరిగిందా అన్నది తెలియాలంటే మాత్రం 17న టెలికాస్ట్‌ అయ్యే ప్రోగ్రామ్‌ చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు