ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా – మధ్యాహ్నం తీర్పు ఇవ్వనున్న కోర్టు

వ తేదీన యధావిధిగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు....

ఏప్రిల్ 8న జరగాల్సిన్ MPTC,ZPTC ఎన్నికలపై ఏపీ ఎన్నికల కమీషన్ ఇచ్చిన నోటిఫికేషన్ పై హైకోర్టు సింగిల్ బెంజ్ జడ్జీ ఇచ్చిన స్టే పై ప్రస్తుతం కోర్టులో విచారణ పూర్తయినట్టు సమాచారం అందుతుంది. మధ్యాహ్నం 2 లేదా 3 గంటల సమయంలో దీనిపై కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఏప్రిల్ 8న ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి కోర్టు ఉత్తర్వులు ఇస్తుందా లేక, స్టే కొనసాగిస్తుందా అనేదానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది.

ఎన్నికలకు మొత్తం సిద్ధంగా ఉన్న సమయంలో స్టే ఇవ్వడం రాజ్యంగ విరుద్ధం కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వైసీపీ వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఇక కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న అధికారులు, ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి సర్వం సిధ్దం చేసుకున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు