Etela Rajender Resign: టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా

Etela Rajender Resign: మాజీ మంత్రి టీఆర్ఎస్ కీలక నేతల ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజీనామా విషయంపై స్పందించారు. తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని తెలిపారు.

తెలంగాణ కోసం తాను కష్టపడ్డానని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు. కాగా రాజేందర్ బీజేపీలో చేరతారని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజులు ఢిల్లీలో పర్యటించి బీజేపీ నేతలను కలవడం ఈ వార్తలకు బలం చేకూర్చుతుంది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు