మినోక్సిడిల్ అంటే ఏమిటి ఇది వాడితే నిజంగా బట్టతల సమస్య పోతుందా?

జుట్టు పలచ పడటం ఊడిపోవడం వంటి సమస్యలు వున్నా వారిలో చాల మంది ఈ మినోక్సిడిల్ ని వాడతారు. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు బట్టతల వచ్చే వేగాన్ని తగ్గిస్తుంది.

అసలు ఈ మినోక్సిడిల్ ఎలా పనిచేస్తుంది?

నిజానికి మినోక్సిడిల్ ని మొదట అధిక రక్తపోటు వున్నవారికి చికిత్స కోసం అభివృద్ధి చేసారు. అయితే పరిశోధకులు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు.బట్ట తల సమస్య వున్నవారు ఈ మినోక్సిడిల్ ని రక్తపోటు చికిత్సకు వాడిన అప్పుడు వారిలో జుట్టు పెరగడం గమనించారు. తరువాత పరిశోధనలు చేయగా ఇది నిజమే అని రుజువు అయ్యింది.

1986 నుంచి బట్ట తల సమస్య అప్పుడే మొదలు అవుతున్న వారికి మినోక్సిడిల్ ని వాడుతున్నారు. నిజానికి ఇది ఒక వాసోడైలేటర్ అంటే రక్త నాళాలను వెడల్పు చేస్తుంది దీని వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మినోక్సిడిల్ ని తలకి రాసుకున్న అపుడు కూడా ఇదే జరుగుతుంది. తల పై వున్నా చర్మముకి రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కావాల్సిన పోషకాలు అంది జుట్టు పెరుగుతుంది.

మినోక్సిడిల్ ఎలా వాడాలి?

మినోక్సిడిల్ బయట 2% మరియు 5% క్యాన్సన్ట్రేషన్ లో దొరుకుంది ఇది ఎటు వంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చే మందు అయినా చాల మంది డాక్టర్ ని సంప్రదించిన తరువుత వాడమని చెప్తారు. మినోక్సిడిల్ ని నేరుగా తలపై రాసుకోవడమే ఇది వాడటం మొదలు పెట్టిన అప్పుడు మొదట జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది అది సహజమే అని చాల పరిశోధనలలో తేలింది. పూర్తీ ఫలితం రావాలి అంటే కనీసం 4 నెలలు వాడాలి.

మినోక్సిడిల్ మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. 40 ఏళ్ళు లోపు వారికీ ఇది వాడటం వలన మంచి ఫలితాలు ఉంటాయి అని తేలింది కానీ వాడటం ఆపేస్తే వెంటనే కొత్తగా వచ్చిన జుట్టు అంత రాలిపోతుంది. అంటే ఒకసారి మినోక్సిడిల్ వాడటం మొదలు పెడితే ఆపకూడదు.

మినోక్సిడిల్ సైడ్ ఎఫెక్ట్స్.

మినోక్సిడిల్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వున్నాయి. మాడు దురద రావడం, తలపై చర్మము మంట, తలా నొప్పి,ఇంకా మొఖము మరియు ఇతర శరీర భాగాలపై జుట్టు పెరగడం వంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కొన్ని సందర్భాలలో గుండె వేగంగా కొట్టు కోవడం,రక్త పోటు తగ్గడం వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఇలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన అప్పుడు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు