బ్రేకింగ్ న్యూస్ టీఆర్ఎస్ ఖాతాలో మరో డివిజన్

బ్రేకింగ్ న్యూస్ టీఆర్ఎస్ ఖాతాలో మరో డివిజన్

నెరేడ్ మేట డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థి మినా ఉపేందర్ రెడ్డి 782 ఓట్లతో విజయం సాధించారు. కాగా ఈ డివిజన్ లో ఇతర గుర్తులతో ఓట్లు వేయడంతో ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదే అని తెలిపింది. దింతో బుధవారం 8 గంటలకు అధికారులు కౌనింగ్ ప్రారంభించారు.

ఇతర గుర్తులతో ఉన్న 544 ఓట్లను లెక్కించారు. అనంతరం ఫలితాలు విడుదల చేశారు. కాగా ఈ ఫలితాల్లో 782 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి మినా ఉపేందర్ రెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కాగా ఆమె ఇంతకూ ముందు 504 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

ఇక బుధవారం లెక్కించిన ఓట్లలో 178 ఓట్ల మెజారిటీ వచ్చింది. దింతో మొత్తం 782 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా ఈ ఫలితాలపై బీజేపీ అభ్యర్థి కన్నీటిపర్యంతం అయ్యారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు