తెలంగాణలో ఇక కరోనా లేదు.. మీడియాలోనూ మాయం.. అంతా సెట్ అయిపోతుంది..

no corona in tealanagna

తెలంగాణలో కరోనా కంట్రోల్ అయిపోయింది.. ఆస్పత్రిలో బెడ్స్ చాలా ఉన్నాయి.. ఎవరికి కావాలంటే వాళ్లకు నిమిషాల్లో బెడ్స్ ఇస్తున్నారు.. కరోనా పరీక్షలు సైతం వేగంగా సాగుతున్నాయి.. 24 గంటల్లోనే రిపోర్ట్ వస్తుంది.. రెమిడెసివర్ ఇంజక్షన్స్ ఎవరికి కావాలంటే వాళ్లకు వేస్తున్నారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ తగ్గిపోయింది.. ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లోనే చికిత్స చేస్తున్నారు.. ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నా.. వైద్య శాఖ కరోనాను కట్టడి చేస్తున్నా.. ప్రజలో ఇష్టానుసారం తిరుగుతూ.. బాధ్యత లేకుండా తిరుగుతున్నారు.. ఇక నుంచి తెలుగు టీవీ ఛానళ్లు, పత్రికల్లో కనిపించే రాతలు ఇవే.. చూపించే, వినిపించే వాయిస్ ఇలాగే ఉండబోతుంది..

ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు.. సీఎం కేసీఆర్ చేతిలో ఉంది. స్వయంగా కరోనా పరిస్థితులను ఆయనే సమీక్షిస్తున్నారు. కట్టడి చేయాలని ఆల్ రెడీ ఆర్డర్స్ ఇచ్చేశారు కూడా..

తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా నుంచి బయట పడేయాలని.. మందులు, బెడ్స్ కొరత లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు సీఎం, వైద్యశాఖ పర్యవేక్షణ చేస్తున్న సీఎం కేసీఆర్. కరోనాపై పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని నియమించారు. కరోనా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతిరోజూ మూడు సార్లు సమీక్ష చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. వ్యాక్సిన్, మందులు, ఆక్సిజన్, బెడ్ల విషయంలో ఎక్కడా లోపం ఉండొద్దని.. కొరత రానీయొద్దని ఆదేశించారు.

ఇప్పటి వరకు బాధ్యతారాహిత్యంగా.. సరైన విధానంలో జరగని కరోనా కట్టడిని.. సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షణలోకి తీసుకోవటంతో అంతా సెట్ అయిపోతుందని. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా నుంచి బయటపడుతుందని ప్రజలతోపాటు ముఖ్యంగా మీడియా బలంగా విశ్వసిస్తోంది. అలాగే అనుకుంటుంది.. ఇక నుంచి అలాగే రాస్తుంది.. మనల్ని భయపెట్టదు.. జస్ట్ అవగాహన కల్పిస్తుంది మీడియా.

తెలంగాణలో కరోనా విలయం, విజృంభణ, కట్టలు తెంచుకుంది.. పిట్టల్లా రాలుతున్న జనం.. అనే హెడ్డింగ్ ఎవరూ పెట్టొద్దు.. మీరు ఇలా రాస్తే అక్కడ విఫలం అయ్యేది సీఎం కేసీఆర్ అన్న సంగతి గుర్తుంచుకుని.. సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఆల్ రెడీ ఇప్పటికే కొన్ని పత్రికలు, టీవీలు ఏపీ – తెలంగాణ మధ్య బాగా వ్యత్యాసం చూపిస్తున్నాయి.. ఇక నుంచి అది కూడా ఉండకపోవచ్చు కదా.

See also : సూపర్ సీఎం కేసీఆర్ : మంత్రిగా ఈటెల బర్తరఫ్.. 24 గంటల్లోనే భూ కబ్జా కేసు తేల్చేశారు.. జెట్ స్పీడ్

See also : కేసీఆర్ ను చూడండి ఒక్క రోజులో మడతపెట్టేశాడు.. మరి జగన్ ఏమో ఏడాదిగా ఎందుకు భరిస్తున్నాడు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు