ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకోవాల్సింది – ప్రజల్లో ఉన్న సానుభూతి కాస్త పోయింది : పనబాక లక్ష్మి

అంతా మీ ఇష్టమేనా ? ఏంపీ ఎన్నికలు కూడా బహిష్కరించండి : పనబాక లక్ష్మి అలక

పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించటంతో ఏపీ రాజకీయం కీలక మలుపు తిరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. నాలుగు వారాల గడువు ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వేసిన పిటీషన్లకు సమర్ధించిన హైకోర్టు.. స్టే విధించటం ఇంట్రస్టింగ్ టాపిక్ అయ్యింది.

హైకోర్టు ఆదేశాలపై హైకోర్టు ధర్మాసనానికి జగన్ ప్రభుత్వం వెళుతుంది.. ఇప్పటికే ప్రకటించింది. పిటీషన్ వేసింది. ఇంత వరకు ఓకే. అసలు నాలుగు వారాల గడువు వచ్చినట్లయితే.. టీడీపీ పోటీ చేస్తుందా.. అప్పుడు గెలుస్తుందా.. సత్తా చాటుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఇలాంటి చర్చే టీడీపీ కార్యకర్తలు, నేతల్లో జరుగుతుంది.

హైకోర్టులో పిటీషన్ వేసి గెలిచిన చంద్రబాబు వ్యూహం ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది నేతలు, కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. నాలుగు వారాల హైకోర్టు గడువుతో.. మళ్లీ జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు వ్యూహంగా ఉందని చెబుతున్నారు సన్నిహితులు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలకు సంకేతాలు వెళ్లినట్లు చెబుతున్నారు.

ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. పోటీ నుంచి తప్పుకున్న తర్వాత కోర్టుకు వెళ్లి సాధించేది ఏంటీ అనే ప్రశ్న సైతం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. నాలుగు వారాల తర్వాత అయినా గెలుస్తాం అని అనుకుంటే దేనికైనా పోరాటం చేయొచ్చు.. అలా కాకుండా ఇలా కోర్టు ద్వారా సాధించినందున పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటీ అంటున్నారు.”అయ్యో తెలుగుదేశం ఇంతలా ఓడిపోతుంది ఏంటి, అనే సానుభూతితో మనకి కొద్దిగా సపోర్ట్ అయినా ఉండేది,కాని కోర్టు కేసులో గెలిచిన తరువాత పరిస్థితి మరింత దిగజారిపోయింది, కోర్టులను అడ్డం పెట్టుకోని చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డం పడుతున్నాడు, అనే మాట ప్రజల్లో మరింత నాటుకుపోయి ఇంకాస్త నెగటివ్ అవుతుంది, ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో ఆ కాసిన ఓట్లు కూడా రాకుండా చేశారు, కనీసం తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో అయిన పెట్టుకోని ఉండాల్సింది” అని స్వయంగా పనబాక లక్ష్మీ ప్రచారం సందర్భంగా తోటి నేతలతో అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు

నాలుగు వారాల తర్వాత జెడ్పీ ఎన్నికలు పెడితే.. ఓటమి నాలుగు వారాల తర్వాత వస్తుంది.. అదేదో ఇప్పుడు జరిగిపోతే ఓ పని అయిపోతుంది.. ఈ గోల ఎందుకు.. ఇప్పటికైనా కోర్టుల ద్వారా పోరాటం కంటే.. ప్రజల కోసం.. ప్రజల్లో ఉండి పోరాటం చేసే వ్యూహాలు, పార్టీ ప్రక్షాళన చేయాలని కరుడుగట్టిన టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు