మీ ఇంటికి ఎవర్నీ రానీయొద్దు-ఇంట్లో కూడా మాస్క్ మస్ట్ – 28 నుండి రిజిస్ట్రేషన్ చేసుకోండి

PM Modi to hold a video-conference with CM’s of all States on 8th April

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లక్షణాలకు సంబంధించి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం ఉన్నా కరోనా లక్షణాలుగా భావించాలని చెబుతూ.. పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

మీ ఇంట్లోకి ఇతరులు ఎవర్నీ రానీయొద్దు.. మీరు ఎవరింటికీ వెళ్లొద్దు.. ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంట్లోని వారందరూ మనోళ్లే.. మన కుటుంబ సభ్యులే.. మనకు ఏమీ కాదులే అనే ధీమా వద్దని వెల్లడించింది. మీ ఇంటి ఎదురోళ్లను.. పక్కనోళ్లను సైతం నమ్మొద్దని.. ఎవరినీ ఇంట్లోకి రానీయొద్దని.. మీరు ఎవరూ ఇతరుల ఇంటికి వెళ్లొద్దని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇంట్లో కూడా మాస్క్ మాస్ట్ అని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి మోడీ.

సాధారణ లక్షణాలు ఉన్న వాళ్లు కరోనా రోగులుగానే భావించి ట్రీట్ మెంట్ తీసుకోవాలని.. కోవిడ్ చికిత్స ముఖ్యం అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. జలుబు, దగ్గు, జ్వరం స్వల్పంగా ఉన్నా కరోనా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అర్హులైన అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకునే వారు 28వ తేదీ నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రర్ చేయించుకోవాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు