పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కొడుకు అరెస్ట్.. చెప్పినా వినలేదు.. శోభనం రాత్రి పోలీస్ స్టేషన్ లో జాగారం…

పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కొడుకు అరెస్ట్.. చెప్పినా వినలేదు.. శోభనం రాత్రి పోలీస్ స్టేషన్ లో జాగారం...

police arrested by groom
police arrested by groom

ఓ వైపు కరోనాతో జనం అల్లాడుతున్నారు.. ఎవరికి కరోనా ఉందో.. ఎవరి నుంచి ఎవరికి వస్తుందో అర్థం కాక వణికిపోతున్నారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, పేరంటాలే కాదు.. ఒకరి ఇంటికి ఒకరు సైతం వెళ్లొద్దని.. సెల్ఫ్ లాక్ డౌన్ కావాలని పదేపదే చెబుతున్నారు వైద్యులు. జనం వినటం లేదని కర్ఫ్యూ, లాక్ డౌన్ పెట్టారు.. అయినా వినటం లేదు కొందరు. అలాంటి వాళ్లను ఏం చేసినా తప్పులేదు.

పంజాబ్ రాష్ట్రం జలంధర్ కు చెందిన ఓ కుటుంబం పెళ్లి వేడుకలకు సిద్ధం అయ్యింది. ఇదే సమయంలో కరోనా కేసులు వేలల్లో వస్తుండటంతో పంజాబ్ ప్రభుత్వం.. జలంధర్ లో ఏప్రిల్ 30వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. అదే కాదు పెళ్లి వేడుకలకు 20 మంది మాత్రమే హాజరుకావాలని.. పోలీస్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఏప్రిల్ 25వ తేదీ పెళ్లి రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసిన పెళ్లి కొడుకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడంట. ఈ వేడుకకు 100 మందిపైనే వచ్చారు. దీనికితోడు రాత్రి 8 గంటల నుంచే కర్ఫ్యూ ఉంది. ఇలాంటి సమయంలో దూంధాం పార్టీ చూసిన పోలీసులు షాక్ అయ్యారు. పర్మీషన్ 20 మందికే ఇచ్చాం.. ఇక్కడ 100 మందిపైనే ఉన్నారు.. ఒక్కరు కూడా కరోనా నిబంధనలకు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జరిగిన తప్పుకు సారీ చెప్పాల్సింది పోయి.. వీళ్లెవరో మాకు తెలియదు.. మేం పిలవకపోయినా వచ్చారు అంటూ పెళ్లి కొడుకు, అతడి తండ్రి ఓవరాక్షన్ చేశారంట. చిర్రెత్తుకొచ్చిన పోలీసులు.. రిసెప్షన్ నుంచి కొత్త పెళ్లి కొడుకు, అతని తండ్రి బొక్కలో వేశారు. ఫంక్షన్ హడావిడి మొత్తాన్ని వీడియో తీసి.. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు.

అంటే అన్నారు అంటారు.. కర్ఫ్యూ ఉంది.. ముందుగానే పోలీస్ పర్మీషన్ తీసుకున్నప్పుడు నిఘా ఉంటుందన్న సంగతి తెలియాలి.. డబ్బులు ఉన్నాయి కదా అని పొగరు, బలుపు కాకపోతే.. కరోనా టైంలో.. అందులోనూ కర్ఫ్యూ టైంలో వందల మందితో పెళ్లి పార్టీ ఇస్తాడు.. వీడిని ఏమనాలి.. శోభనం రోజు.. పోలీస్ స్టేషన్ లో పడ్డాడు.. జాగారం చేశాడు.. వదలద్దయ్యా ఇలాంటోళ్లను.. ఓ వారం, 10 రోజులు బొక్కలో వేయండి.. కరోనా వార్డులో పడేయండి అంటున్నారు నెటిజన్లు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు