Prashant Kishor: మూడో సారి భేటీ అయిన శరద్ పవార్..ప్రశాంత్ కిషోర్.

Prashant Kishor: దేశ రాజకీయాల్లో ఎక్కడ చూసిన, ప్రశాంత్ కిషోర్, శరద్ పవార్ భేటీ పైనే చర్చ నడుస్తుంది. పదిహేను రోజుల వ్యవధిలో వీరిద్దరూ మూడుసార్లు భేటీ అయ్యారు. ఈ భేటీలో థర్డ్ ఫ్రంట్ గురించే చర్చ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ నెల 11 న శరద్ పవార్ తో మొదటిసారి భేటీ అయ్యారు పీకే.. ఆ తర్వాత గత సోమవారం భేటీ అయ్యారు.. పీకే రెండోసారి భేటీ తర్వాత పవార్ అధ్యక్షతన ఢిల్లీలోని తన నివాసంలో 8 ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు..

మొదట 15 పార్టీలకు చెందిన నేతలు వస్తారని అంచనా వేయగా చివరకు 8 పార్టీల నేతలు మాత్రమే వచ్చారు. ఇక ఈ భేటీలో బీజేపీని 2024లో ఎలా ఎదురుకోవాలి అనే అంశాలపై చర్చించారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే విధంగా పథకరచన చెయ్యాలని సమావేశానికి హాజరైన నేతలకు తెలిపారు పవార్.

ఇక మంగళవారం రాజకీయ నేతలతో భేటీ అనంతరం శరద్ పవార్. ఈ రోజు (23-06-2021) ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం శరద్ నివాసంలో భేటీ అయ్యారు. గంటపాటు వీరి భేటీ కొనసాగినట్లుగా తెలుస్తుంది. వీరు థర్డ్ ఫ్రంట్ గురించించే చర్చించినట్లు సమాచారం.

బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, బీజేపీని అధికారం నుంచి దింపాలని చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం వీరి కూటమి బీజేపీని ఓడించలేదని లెక్కలేసి మరి చెబుతున్నారు. బీజేపీని థర్డ్, ఫోర్త్ ఫ్రంట్స్ కి బీజేపీని ఓడించే శక్తి లేదని తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు