సమాజంలో ఇలాంటోళ్లు ఉండబట్టే.. జగన్ అందరికీ ఇళ్లు ఇస్తున్నారు

ap cm jagan

నాణానికి రెండు వైపులు ఉంటాయి.. ఒకటి బొమ్మ.. మరొకటి బొరుసు.. మన వైపు బొమ్మ లేప్పుడు బొరుసు గొప్పగా కనిపిస్తుంది.. అదే బొరుసుపై మనం గెలిస్తే.. బొమ్మ తక్కువగా కనిపిస్తుంది.. ఇప్పుడు ఇలాంటి ఘటన ఒకటి ఏపీలో జరిగింది. ఓ ఘటన.. మరో ప్రభుత్వ పథకానికి లింక్ అయ్యింది.. ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలోని ఓ ఇంట్లో.. 85 ఏళ్ల తల్లి ఏకుల మరియమ్మతో కుమారుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం వయస్సు రీత్యా మరియమ్మ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కుమారుడు తల్లిని ఆస్పత్రికి తరలించగా.. నాలుగు రోజుల తర్వాత కోలుకుని ఇంటికి వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో.. కరోనా పరీక్షలు చేసిన డాక్టర్లు.. నెగెటివ్ వచ్చిందని.. ఎలాంటి భయం లేదని చెప్పి పంపించారు.

ఇంటికి వచ్చిన మరియమ్మను ఇంటి ఓనర్లు ఇంట్లోకి రానివ్వలేదు. మీకు కరోనా ఉంది.. ఎలా ఇంట్లోకి వస్తారంటూ ప్రశ్నించారు. డాక్టర్ రిపోర్ట్ చూపించినా.. మీకు లక్షణాలు ఉన్నాయని.. అవి పరీక్షల్లో బయటపడటం లేదు అంటూ ఓనర్లు ఎదురుదాడి చేశారు. అసలు మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ బలవంతం చేశారు. పెద్ద తగాదా పెట్టుకున్నారు. దీంతో గత్యంతరం లేక ఏప్రిల్ 20వ తేదీ రాత్రి అంతా సమీపంలోని ఓ చర్చికి సంబంధించి సమాధుల దగ్గర ఉన్న షెడ్లులో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఇంటి ఓనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఇంట్లోకి దిగే విధంగా చేశారు. కరోనా నెగెటివ్ వచ్చిందని డాక్టర్లు స్వయంగా చెప్పారని పోలీసులు గట్టిగా చెప్పటంతో ఒప్పుకున్నారంట.

సమాజంలో మానవత్వం అనేది మచ్చుక కూడా లేదు అనటానికి ఇదో ఎగ్జాంపుల్. కరోనా వస్తే ఇళ్లు ఖాళీ చేయాలి.. చచ్చిపోతే అద్దె ఇంట్లో శవాన్ని ఉంచకూడదు.. కుటుంబ సభ్యులు ఉండకూడదు.. అద్దెకున్న వాళ్లలో ఎవరైనా చనిపోతున్నారు అంటే ఇల్లు ఖాళీ చేయాలి.. ఇలాంటి ఘటననే వాళ్ల ఇంట్లో జరిగితే వాళ్లకు ఓకే.. పక్క ఇంట్లో జరిగినా.. రెండు ఇళ్ల మధ్య తడిక గ్యాప్ అయినా పర్వాలేదు.. కానీ మా ఇంట్లో చావు ఉండకూడదు.. మేం చూడకూడదు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు ఇంటి ఓనర్లు..

ఇలాంటి వాళ్లు ఉండబట్టే కదా.. సీఎం జగన్ 30 లక్షల ఇళ్లు ఇస్తుంది.. రోడ్డుపై మృతదేహం ఉండకూడదు.. ఎవరైనా సరే సొంతింట్లోనే చనిపోవాలి.. గౌరవం చివరి రోజు వెళ్లిపోవాలి.. బతికినన్నాళ్లు గౌరవంగా ఇది నా ఇల్లు అని ధీమాతో బతకాలి అనేదే కదా సీఎం జగన్ లక్ష్యం అంటున్నారు.

సీఎం జగన్ 30 లక్షల ఇల్లు ఇస్తుంటే.. మా ఇంటి అద్దెలు పడిపోతున్నాయ్.. మా ఇళ్లల్లో ఎవరుంటారు అని మళ్లీ ఏడిచేదీ వీళ్లే.. అద్దెకున్నోళ్లను వీళ్లిష్టం వచ్చినట్లు తిరిమేసేదీ వీళ్లు అంటున్నారు ఏకుల మరియమ్మ విషయంలో జరిగిన ఘటనతో..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు