వివాదంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. డబ్బు తీసుకోని ఇవ్వడం లేదని కార్యకర్త ఆవేదన

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సమయంలో తన వద్ద 1 కోటి 40 లక్షల రూపాయలు ఎమ్మెల్యే తీసుకున్నారని మేకల రవీంద్ర అనే వైసీపీ కార్యకర్త శ్రీదేవిపై ఆరోపణలు చేశారు. డబ్బు అడిగితె ఇవ్వడం లేదని మీడియాకు తెలిపాడు. ఎన్నికల సమయంలో తన భర్త మోసం చేశాడని తనతో చెప్పుకుని ఉండవల్లి శ్రీదేవి వాపోయిందని, ఆమె కన్నీరు పెట్టుకోవడంతో చూడలేక తనకు తెలిసిన వాళ్ల వద్ద డబ్బు తీసుకుని ఆమెకు ఇచ్చానని రవి వివరించారు.

తాను ఇచ్చిన డబ్బులో ఇప్పటివరకు 60 లక్షలు ఇచ్చారని మిగతా డబ్బు అడిగితె బ్యాలెన్స్ ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని మేకల రవి తెలిపారు. ఈ విషయంలో తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని, లేకపోతే రాజధాని ప్రాంతంలో జరిగే మొదటి వైసీపీ కార్యకర్త ఆత్మహత్య తనదే అవుతుందని స్పష్టం చేశారు. తనో దళితుడిని, సొంత వర్గం వ్యక్తినే ఎమ్మెల్యే మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి