భార్య తల నరికి తలతో పోలీస్ స్టేషన్ కి వచ్చిన భర్త

అనోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు కోపతాపాలకు పోతున్నారు.. అనుమానాలు కూడా అధికమయ్యాయి… దింతో పచ్చని కాపురాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇక అనుమానంతో ప్రాణాలు తీస్తున్నారు కొందరు..

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటన అందరిని కలచివేస్తుంది. భార్యపై అనుమానంతో ఆమె తలను తెగనరికి పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లాడు భర్త… బందా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నార్ యాదవ్, విమలా భార్యాభర్తలు, గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ తరచూ గొడవ గొడవపడుతున్నారు..

అనుమానమే ఈ గొడవకు కారణమైంది.. ఇలా గొడవ ముదరడంతో హత్యకు దారితీసింది.. ఇక తలను తీసుకోని బబేరు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి లొంగిపోయాడు. అతని వద్ద నుంచి పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమలా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు తలను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌ వెళ్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి