నిర్మల్ జిల్లాలో 108 డ్రైవర్ మృతి – కరోనా వ్యాక్సిన్ కారణం అంటూ ఆరోపణలు

ambulence driver died in nirmal district

గత శనివారం నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఇటు తెలంగాణలో సైతం అనుకున్న ప్రణాళిక ప్రకారమే వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందనుకుంటున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో చిన్న కలకలం రేగింది.

తెలంగాణలోని నిర్మల్ జిల్లా పరిధిలో 108 అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న విఠల్ అనే వ్యక్తి హఠాన్మరణం చెందారు. కుంటాల గ్రామానికి చెందిన విఠల్ స్థానిక పి.హెచ్.సి లో మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు సమాచారం.

ఎంతో ఆరోగ్యంగా ఉన్న విఠల్ మృతికి కరోనా వ్యాక్సినే కారణం అని బంధువులు ఆరోపిస్తున్నారు. వాక్సిన్ వేయించుకున్న రోజు రాత్రి నుండి అనారోగ్యంగా ఉండటంటో విఠల్ ను నిర్మల్ ఏరియా హాస్పటల్లో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ విఠల్ మరణించడు.

అయితే వైద్యులు మాత్రం విఠల్ గుండెపోటు కారణంగా మరణించాడని. ఆ గుండెపోటుకు కారణం వ్యాక్సినా లేక వేరే ఇతర కారాణాల అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.వ్యాక్సిన్ కారణంగానే విఠల్ మరణించాడని పుకార్లు జిల్లా మొత్తం వ్యాపించడంటో రేపు జరగాల్సిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఎంత మంది హాజరవుతారనేదానిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు