వినియోగదారులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరలు

కష్టకాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర పెంచింది. కరోనా వైరస్‌ వల్ల పడిపోయిన రెవెన్యూను పెంచుకునేందుకు గ్యాస్ పై వ్యాట్‌ను భారీగా పెంచింది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రజల కోసం చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాలకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు.. ఇప్పటికే చాలా అప్పులు చేసింది. దింతో నిత్యావసరమైన గ్యాస్ పై వ్యాట్ నుంచి పెంచింది ఇప్పటివరకు రాష్ట్రంలో 14.5 శాతం వ్యాట్ ఛార్జ్ తీసుకుంటున్నారు. దీనిని 24.5 శాతం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 10 శాతం వ్యాట్ ను పెంచింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న రేటుకు పది శాతం రేటు పెరగనుంది. కరోనా కష్టకాలంలో ప్రజలు డబ్బులేక అవస్థలు పడుతుంటే గ్యాస్ పెరుగుదల గుదిబండలా మారింది.

ఇక ఆర్థిక వేత్తలు మొదటి నుంచి ఈ విషయంపై వ్యతిరేకతతోనే ఉన్నారు. సంక్షేమ ఫలాలు, పథకాలూ ఎక్కువగా ప్రకటిస్తే… వాటిని నెరవేర్చడం కోసం రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వస్తుందంటున్నారు. ఏపీలో అలాంటి పరిస్థితే ఏర్పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో హామీలను నెరవేర్చాల్సిందే అనుకుంటున్న ప్రభుత్వం… ఆదాయం కోసం రకరకాల మార్గాల్ని అన్వేషిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏపీలో వంట గ్యాస్ ధరలు పెరగనున్నాయి. కాగా వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏపీ అప్పులు మరింత పెరిగినట్లు తెలుస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి