పప్పులో కాలేసిన లోకేష్.. ఘాటుగా విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి

టీడీపీ నేత లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదంటూ చురకలంటించారు. ‘లోకేశం..నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీకి మధ్య తేడా కూడా తెలియదా? నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు జరిగితే ఎల్పీజీ పై అని దుష్ప్రచారం చేయిస్తావా? అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా? ఇంత అజ్ఞానం పెట్టుకొని మళ్లీ ఎడిటోరియల్స్ రాస్తున్నట్లు బిల్డప్. లోకం నవ్వుతుంది పప్పు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

అయితే సహజవాయువుపై 10 శాతం వ్యాట్ పెంచుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఇప్పటివరకు వ్యాట్ 14.5 శాతం ఉండగా దాన్ని 24.5 శాతానికి పెంచుతూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వల్ల ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో సహజవాయువుపై అదనంగా 10 శాతం మేర వ్యాట్ పెంచుతున్నట్లు తెలిపింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి