బతకాలని రాసి పెట్టి ఉంటే నిజంగా ప్రకృతి కూడా ఓర్పు వహిస్తుందా – ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది

nature and fate

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఫుల్ వైరల్ గా మారిన ఈ వీడియో టిక్ టాక్ వీడియో. ప్రస్తుతం టిక్ టాక్ బ్యాన్ కావడంతో ఎవరో ఆ వీడియోను ఫేస్ బుల్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది, కాని ఎక్కడ అనేది మాత్రం అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటంటే, వర్షాలు, వరదలు కారణంగా ఒక చిన్న గల్లీ ( రోడ్డు ) మొత్తం నీటితో నిండి పోయి.. ఉంది. ఆ పక్కనే గోడలు బాగా నాని కూలడానికి సిధ్దంగా ఉన్నాయి. ఆ గల్లీలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మగ / ఆడ అనేది క్లారిటీ లేదు. వారిలో ఒకరు నడుచు కూంటు వెళ్లిపోయారు. మరొకరు అక్కడ కొద్ది సేపు ఉండి.. ఏదో చెక్ చేసుకోని ముందుకు నడిచి వెళ్లిపోయారు. అలా వెళ్లిన మరుక్షణమే గోడ కుప్ప కూలిపోయింది. ఆ వీడియోకు బతకాలని రాసి పెట్టి ఉంటే.. ప్రకృతి కూడా ఓర్పుగా ఉంటుంది,నిన్ను కాపాడుతుంది అని ట్యాగ్ లైన్ పెట్టడంతో నిజమే కదా అనిపిస్తుంది. ఈ వీడియోను రెండు మూడు సార్లు.. ముఖ్యంగా కూలుతున్న ఆ గోడను రిపీట్ రిపీట్ గా చూస్తే నిజమే కదా అని అనిపిస్తుంది. కష్టపడి ఇంత విషయం చదివాక ఆ వీడియో చూడకపోతే ఎలా.. ఒక సారి చూడండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు