తెగిపడుతున్న అమ్మాయిల తలలు

తెగిపడుతున్న అమ్మాయిల తలలు

దేశంలో మృగాలా చేతిలో బలవుతున్న యువతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రేమించలేదని ఒకడు, మతం మారలేదని ఇంకొకడు, తనను కాకుండా మరొకడ్ని ప్రేమిస్తుందని ఇంకొకడు. ఇలా అమ్మాయిల ఉసురు తీస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అక్టోబర్ నెలలో అందరికి తెలిసి ముగ్గురు అమ్మాయిలు హత్యకు గురయ్యారు. ఇంకా బయటికి రానివి ఎన్నున్నాయో తెలియదు. విజయవాడలో గత నెలలో విధులు ముగించుకొని వస్తున్నా నర్స్ పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడో ఉన్మాది. తీవ్రమైన కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది.. ఆ ఘటన జరిగిన కొన్ని రోజులకే దివ్య అనే యువతిని కత్తితో పొడిచి చంపాడు నాగేంద్ర అనే దుర్మార్గుడు. ఇక శనివారం విశాఖ జిల్లాలో మరో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదని అక్కసుతో వరలక్ష్మి ఆమె 17 ఏళ్ల అమ్మాయిని అఖిల్‌సాయి వెంకట్ అనే ఉన్మాది కత్తితో గొంతు కోశాడు. తీవ్ర గాయం అవడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఇటువంటి ఘటనలు నిత్యకృత్యం అవడంతో యువతుల్లో ఆందోళన మొదలైంది.

ఇక ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. యువతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. వరలక్ష్మి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్మాదికి ఉరిశిక్ష వెయ్యాలని. కోరుతున్నారు కుటుంబ సభ్యులు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి