ఏపీలో మరో శిరోముండనం ఘటన.. అప్పు కట్టలేదని గుండు చేయించిన వ్యక్తి

విశాఖ శిరోముండనం ఘటన మరువక ముందే పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చలేదని అలక అభిలాష్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కారులో ఎక్కించుకొని శిరోముండనం చేశారు. వివరాలను ఒకసారి పరిశీలిస్తే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన అలక అభిలాష్ అనే వ్యక్తి.. జంగారెడ్డిగూడం కు చెందిన విజయ్ బాబు అనే వ్యక్తి దగ్గర మూడు నెలల క్రితం 30 వేలు అప్పుగా తీసుకున్నారు.

 

ఆ బాకీ తీర్చాలంటూ అక్టోబర్ 1 తేదీ నుంచి విజయ్ బాబు వత్తిడి చేయడం మొదలు పెట్టాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన మిత్రులైన షేక్ నాగుల్మిరా, కంకిరెడ్డి మార్కండేయులుతో కలిసి అక్టోబర్ 3 తేదీన అతడిని కారులో ఎక్కించుకొని జంగారెడ్డిగూడం బాట గంగమ్మ లేఔట్ కు తీసుకొచ్చారు. అక్కడ ఓ ఇంట్లో ఉంచారు. వేరే వ్యక్తిని పిలిపించి శిరోముండనం చేయించారు. అంతరం జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. దింతో అభిలాష్ పోలీసులను ఆశ్రయించడంతో వారిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం అభిలాష్ ను పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి