కొన్ని రోజుల కిందట ఏలూరు ప్రజలను వణింకించిన వింత వ్యాధి గురించి ప్రజలు మరచిపోతున్న తరుణంలో, మరో వింత వ్యాధి పశ్చిమ గోదావరి జిల్లాలో బయటపడింది. ఏలూరులో కంటి మీద కునుకు లేకుండా చేసిన వింత వ్యాధి, ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పూళ్లగ్రామాన్ని కలవరపెడుతుంది.
పొలంలో పనిచేస్తున్న ఒక రైతు ఏం జరుగుతుందో తెలియకుండానే ఒక్కసారి కుప్పకూలిపోవడంతో స్థానికులందరూ దీన్ని ఏలూరు తరహా వింత వ్యాధితో పోలుస్తున్నారు. రైతు కుప్పకూలిన ప్రదేశం నుండి రోడ్డు మార్గానికి చాలా దూరం ఉండటంటో అందరు కలసి అతన్ని చేతుల మీద మోసుకుంటూ రెండు కిలో మీటర్లు ప్రయాణించారు. అప్పటికే అక్కడకు వచ్చి చేరుకున్న 108 వాహానంలో ఆ రైతును హాస్పటల్ కు తరలించారు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి