భర్తను చిత్ర హింసలు పెట్టిన భార్య.. మరొకరితో గదిలో ఉండగా పట్టుకున్న పోలీసులు

భర్తను చిత్రహింసలు పెడుతున్న భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ రామంతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య భర్తలు కాపురం ఉంటున్నారు.. తన భర్త తనను వేధిస్తున్నాడు అంటూ గతంలో కేసు పెట్టింది.. విషయం తెలియని పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది.. భర్తనే భార్య చిత్ర హింసలకు గురిచేసేది.. మానసికంగా వేధించేది..

అంతే కాదు అక్రమ సంబంధం పెట్టుకొని భర్తకు ఓ రకంగా పిచ్చిలేసేలా చేసింది.. ఈ నేపథ్యంలోనే ప్రియుడితో ఇంట్లో ఉన్న సమయంలో భర్త గమనించాడు.. మానసిక ఆవేదనతో పోలీసులకు వెళ్లి చెప్పాడు.. మొదట అతడి వాలకం చూసి పోలీసులు నమ్మలేదు.. పోలీసులను బ్రతిమాలి ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లాడు.. రెండు మూడు సార్లు డోర్ కొట్టారు.. అనంతరం డోర్ తీయగా వేరే వ్యక్తితో ఉంది మహిళ దింతో పోలీసులు ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు..

మొదట భర్తను చూపిస్తూ ని భర్తేనా అని అడిగారు.. అవునని సమాధానం చెప్పింది.. ఈ సమయంలోనే తనను భార్య పెట్టిన వేధింపులను పోలీసులకు తెలిపాడు. తనపై గృహహింస కేసు పెట్టించి వేదించిందని తెలిపాడు.. తాను ఎప్పుడు ఆమెను ఏమనలేదని, తన ప్రవర్తనలో మార్పు రావడంతో ఒకరోజు ప్రశ్నించానని దానికే ఆమె కేసు పెట్టిందని అన్నారు..

తన భార్యను పూర్తిగా మార్చుకున్నాడని అతడు ఏమి చెబితే ఈమె అది చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.. కాగా ఆమెపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి