జెడ్పీ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం 6 గంటలకు మీడియాకు లీక్ అయ్యింది. టీడీపీ అనుకూల మీడియాలో మొదట బ్రేకింగ్ వచ్చింది. అందరూ షాక్ అయ్యారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అని ఎవరూ ఊహించలేదు. ఎల్లో మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరగటంతో దాదాపు కన్ఫామ్ అనుకున్నారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.
ఏప్రిల్ ఒకటో తేదీ రాత్రి 8 గంటల సమయంలో పొలిట్ బ్యూరో సమావేశం ఉంటుందని అందరికీ సమాచారం వెళ్లింది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు టీడీపీ కీలక నేతలు సమావేశం అయ్యారు. చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తం చేయగా.. కొంత మంది వ్యతిరేకించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే బెటర్ అంటూ వాళ్లకు సర్ధి చెప్పి.. ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం పెట్టి స్వయంగా ప్రకటించారు చంద్రబాబు.
బెడిసి కొట్టిన ఎన్నికల బహిష్కరణ – బహిష్కరణ ఐడియా వెనుక అతని హస్తం
పార్టీలో ఎవరూ ఊహించని ఎన్నికల బహిష్కరణ నిర్ణయం వెనక ఎవరు ఉన్నారు.. చంద్రబాబును అంతలా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు.. 24 గంటల్లోనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం వెనక ఉన్న వ్యక్తి ఎవరు అనేది పార్టీలో అంతర్గత చర్చలు దారి తీసింది. జెడ్పీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యి.. బ్యాలెట్ పేపర్ల ముద్రణ సైతం కంప్లీట్ అయ్యి.. కొత్తగా షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది పార్టీ నేతలు, కార్యకర్తలను తొలిచేస్తున్న ప్రశ్న.
ఈ ప్రశ్నను ఓ సీనియర్ టీడీపీ లీడర్ నుంచి సమాధానం వచ్చింది. జెడ్పీ ఎన్నికల బహిష్కరణ ఆలోచన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ది అంట. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత చంద్రబాబు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ చేసినట్లు చెబుతున్నారు. నేను పదవిలో ఉండగానే.. అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు కానీ జెడ్పీ ఎన్నికలను ఎదుర్కొంటే.. కనీసం 15 శాతం ఓట్లు రావు.. అధికార పార్టీ కసితో.. కోపంతో.. పట్టుదలతో రెచ్చిపోతుంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన 23 శాతం ఓట్లు కూడా జెడ్పీ ఎన్నికల్లో వచ్చే పరిస్థితి లేనప్పుడు.. స్వచ్ఛంధంగా ఎన్నికలను బహిష్కరిస్తే సరిపోతుందనే సలహా ఇచ్చారంట.
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సలహా మేరకు చంద్రబాబు బహిష్కరణ నిర్ణయాన్ని చకచకా తీసుకుని.. ప్రెస్ మీట్ పెట్టేసి.. 20 గంటల్లో తేల్చేశారంట. ఓట్ల శాతం పడిపోయింది అనే మచ్చ రాకుండా ఉండటం కోసమే ఇలా చేశారని చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఎస్ఈసీ ప్రభుత్వంపై పోరాడిన నిమ్మగడ్డ.. సాధారణ పౌరుడిగా సన్నిహితుడు అయిన చంద్రబాబుకు మంచి సలహా ఇచ్చారు అంటున్నారు.